వైరల్ పిక్ : బిఎస్ఎఫ్ సోల్జర్స్ తో అల్లు అర్జున్ ఫామిలీ

Published on Sep 30, 2022 2:00 am IST


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి, కూతురు అర్హ, కొడుకు అయాన్ అందరూ నేడు అమృత్ సర్ లో సందడి చేసారు. నేడు స్నేహారెడీ బర్త్ డే కావడంతో తన సతీమణికి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా విషెస్ తెలియచేసిన అల్లు అర్జున్, కుటుంబ సమేతంగా నేడు అమృత్ సర్ విచ్చేసి అక్కడి గోల్డెన్ టెంపుల్ కి వెళ్లారు. కాగా ఆ టెంపుల్ లోని పలువురు పూజారులు, భక్తులు వారి ఫామిలీతో ఫొటోలు దిగారు.

ఆ తరువాత అమృత్ సర్ లోని బిఎస్ఎఫ్ సోల్జర్స్ ని కలిసిన అల్లు ఫామిలీ సరదాగా కాసేపు వారితో కలిసి మంచి క్వాలిటీ టైం గడిపారు. అనంతరం పలువురు సోల్జర్స్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఫోటోలు దిగడం జరిగింది. కాగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతున్నాయి. ఇక అతి త్వరలో తన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ మూవీ షూట్ లో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు అల్లు అర్జున్.

సంబంధిత సమాచారం :