వైరల్ : కొత్త లుక్ తో ఐకాన్ స్టార్ బ్యాక్ టు స్టైలిష్ స్టార్..!

Published on Jun 7, 2023 5:40 pm IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర ప్రెజెంట్ జెనరేషన్ లో స్టైల్ అంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్. మరి తనదైన డ్రెస్సింగ్ మరియు హైర్ స్టైల్స్ తో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేసిన తాను అల వైకుంఠపురములో వరకు కూడా స్టైలిష్ స్టార్ ట్యాగ్ తోనే వచ్చాడు. మరి తన పాన్ ఇండియా ఎంట్రీ “పుష్ప” తో అయితే ఐకాన్ స్టార్ గా మారిన తాను తన నుంచి మాత్రం ఆ స్టైల్ అనేది తనని వదల్లేదు.

ఆఫ్ లైన్ లో సూపర్ స్టైలిష్ లుక్స్ లో కనిపించే బన్నీ లేటెస్ట్ గా తాను మార్చిన సరికొత్త లుక్ అండ్ కొన్ని ఆఫ్ లైన్ పిక్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెయిన్ గా బన్నీ హెయిర్ స్టైల్ లో చాలా చేంజ్ కనిపిస్తుంది. చిన్న పోనీ టైల్ తో బ్లాక్ అవుట్ ఫిట్ లో బన్నీ అదరగొట్టేసాడు. మరి ముంబై లో అయితే తన భార్య అల్లు స్నేహ రెడ్డి తో అయితే తాను కనిపించాడు. దీనితో ఈ సూపర్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ లో యిట్టె వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :