సోషల్ మీడియాలో అంతకంతకూ పెరుగుతున్న బన్నీ భారీ క్రేజ్.!

Published on Jun 18, 2022 9:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో సొంతంగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నామో చూస్తూనే ఉన్నాము. లేటెస్ట్ గా “పుష్ప” తో అయితే నార్త్ లో తనకున్నది జస్ట్ యూట్యూబ్ వరకు క్రేజ్ కాదు థియేటర్స్ కి ఆడియెన్స్ వచ్చి టికెట్ కొని 100 కోట్లు నెట్ వసూళ్లు అందించే రేంజ్ ఉందని ప్రూవ్ చేసాడు. అది కూడా ఎలాంటి సరైన ప్రమోషన్స్ లేకుండా.

ఇక ఇక్కడ నుంచి అయితే అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ కి బారికేడ్స్ బద్దలయ్యాయి. దీనితో మన టాలీవుడ్ నుంచి అయితే ఇన్స్టాగ్రామ్ లో ఏ హీరోకి కూడా లేని భారీ క్రేజ్ అల్లు అర్జున్ కి సొంతం అవ్వడమే కాకుండా భారీ ఎత్తున ఫాలోవర్స్ తో చాలా మార్జిన్ లో ముందున్నాడు. లేటెస్ట్ గా అయితే 18.5 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ కి తాను చేరుకున్నాడు.

ఇది వరకు అయితే విజయ్ దేవరకొండ కి బన్నీ కి ఒకటి అర మిలియన్ తేడా ఉండేది కానీ ఇప్పుడు అయితే అంతకంతకూ బన్నీ క్రేజ్ పెరుగుతూ వెళ్తుంది. ఇదే స్పీడ్ లో అయితే టాలీవుడ్ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ 20 మిలియన్ కలిగిన హీరోగా బన్నీ నిలుస్తాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :