బాలీవుడ్ దర్శకుడితో బన్నీ మంతనాలు..!

Published on Mar 15, 2022 3:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి పుష్ప తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదండోయ్. ముఖ్యంగా పుష్ప సినిమాతో బన్నీకి బాలీవుడ్‌లో బాగా పేరు వచ్చి పడింది. ప్రస్తుతం పుష్ప-2 కి రెడీ అవుతున్న బన్నీ బాలీవుడ్‌లో పాగా వేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీని హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి మరీ బన్నీ మీట్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దక్షిణాది యోధుని ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఒక పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, అందులో అల్లు అర్జున్ హీరోగా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మరీ త్వరలో ఈ కాంబినేషన్‌పై ఏదైనా క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :