త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మూడవ సారి సినిమా చేయనున్నాడని తెలిసిందే. ఈవిషయాన్ని ప్రకటించి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఈ సినిమా గురించి కనీసం ఒక్క అప్డేట్ అయినా వెలుబడలేదు. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఈసినిమా గురించి అప్డేట్స్ ఇవ్వాలని చిత్ర నిర్మాతల ఫై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థలో ఒకటైన హారిక హాసిని క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే వుందని అతి తర్వలోనే ఈ చిత్రం గురించి అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఇక ఇదిలావుంటే ఈసినిమా క్యాస్టింగ్ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వెలుబడుతుంది. మరి వీటిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.
