‘నా పేరు సూర్య’ ముందుకు వచ్చింది

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా ‘నా పేరు సూర్య’. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తీసిన మొదటి సినిమా ఇది. అను ఇమ్మానుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బన్నీ ఆవేశం కలిగిన సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని కొన్ని నెలలక్రితం చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాని తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చెయ్యబోతున్నట్లు సమాచారం. సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈరోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి విశాల్, శేఖర్ లు సంగీతాన్ని అందిస్తున్నారు.