క్రేజీ న్యూస్ : నేడు అల్లు అర్జున్ న్యూస్ మూవీ అనౌన్స్ మెంట్ ?

Published on Mar 3, 2023 3:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాసిల్ నెగటివ్ రోల్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే విషయం ఏమిటంటే, దీని తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ వర్క్ చేయనుండగా, దాని అనంతరం ఆయన కెరీర్ 23వ మూవీ ని నేడు గ్రాండ్ గా అనౌన్స్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్. అయితే ఇది పక్కాగా అల్లు అర్జున్ కెరీర్ లో ఫ్రెష్ కాంబినేషన్ అని, దర్శకడు అలానే బ్యానర్ వంటి వివరాలు నేడు ఉదయం 8 గం. 1 ని. లకు అధికారకంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ సినిమా గురించిన డీటెయిల్స్ తెలియాలి అంటే మరికొన్ని గంటల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :