అల్లు అర్జున్ కొత్త సినిమా వివరాలు !

30th, December 2017 - 02:40:47 PM

అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియ అనే సినిమా చేస్తున్నాడు. వక్కంతం వంశి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అను ఇమ్మానుల్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ మూవీ తరువాత బన్ని ఏదర్శకుడితో సినిమా చెయ్యబోతున్నాడన్నది ప్రశ్న.

తాజా సమాచారం ప్రకారం ఒక్క క్షణం దర్శకుడు విఐఆనంద్ తో బన్ని సినిమా ఖరారు అయ్యిందని సమాచారం. ఈ దర్శకుడు ఒక సైన్సు ఫిక్ష్శన్ కథ చెప్పాడని అదినచ్చిన బన్ని వెంటనే ఓకె చేసినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా గీత ఆర్ట్స్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. నాపేరు సూర్య సినిమా తరువాత బన్ని సినిమా ఇదే అవ్వడం విశేషం.