అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై లేటెస్ట్ టాక్ ఏంటంటే?

Published on Nov 27, 2021 2:00 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియన్ చిత్రం డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ బ్యానర్‌లో, ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

అయితే వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ సినిమా చేయాల్సి ఉంది కానీ దీని గురుంచి ప్రస్తుతం ఎలాంటి వార్తలు వినిపించడం లేదు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ఉండొచ్చనే ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు పరశురామ్, రాధాకృష్ణ కుమార్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో ఎవరు తమ స్కిట్స్‌తో బన్నీని మెపిస్తారో మొదట వారితోనే సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :