ఆ డైరెక్టర్ తో మరొక మూవీ చేయడానికి సిద్దమైన ఐకాన్ స్టార్ ?

ఆ డైరెక్టర్ తో మరొక మూవీ చేయడానికి సిద్దమైన ఐకాన్ స్టార్ ?

Published on Dec 27, 2022 2:30 AM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న పుష్ప ది రూల్ మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. గత ఏడాది సుకుమార్ తీసిన పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ ఎవరితో మూవీ చేస్తారు అనే దానిపై ఇప్పటికే కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం పుష్ప ది రూల్ తరువాత, గతంలో తనకు రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీని అందించిన సురేంద్ర రెడ్డితో అల్లు అర్జున్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని, ప్రస్తుతం ఆయన కోసం సురేందర్ ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్నారని, త్వరలో దానికి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం అఖిల్ తో సురేందర్ రెడ్డి ఏజెంట్ అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు