బన్నీ ట్రైనింగ్ కోసం యూఎస్ వెళ్లడంలేదట !

27th, July 2017 - 11:26:26 AM


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాను చేస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ కోసం ఫిజికల్ మేకోవర్ కు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా బన్నీ ట్రైనింగ్ కోసం నెల రోజుల పాటు యూఎస్ వెళతారనే వార్త బయటికొచ్చింది. కానీ తాజాగా ఆయన టీమ్ నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు బన్నీ యూఎస్ వెళ్లడంలేదని స్పష్టమైంది.

యూఎస్ నుండే ఒక ట్రైనర్ హైదరాబాద్ కు వచ్చి బన్నీకి శిక్షణ ఇస్తాడట. అలాగే ఆగష్టు 12 నుండి ఆయన చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారని కూడా తెలుస్తోంది. దేశ భక్తి నైపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ ఒక మిలిటరీ అధికారిగా కనిపించనుండగా అయన సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించనుంది. వక్కంతం వంశీ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాతి కానుకగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.