మహేష్ కి పర్శనల్ గా అల్లు అర్జున్ బిగ్ కంగ్రాట్యులేషన్స్.!

Published on Jun 4, 2022 7:00 pm IST

లేటెస్ట్ గా ఇండియన్ సినిమా దగ్గరకి వచ్చి మంచి హిట్ గా నిలిచిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన చిత్రం “మేజర్” కూడా ఒకటి. దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన ఈ చిత్రం రియల్ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కగా దేశ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈ సినిమా చూసాక మరింత భావోద్వేగానికి లోనవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రశంసలు కురిపించాడు. తాజాగా చూసిన ఈ సినిమా తనకి ఎంతో నచ్చింది అని హీరో అడివి శేష్ నుంచి నటీ నటులు ప్రకాష్ రాజ్ దర్శకుడు శశికిరణ్ తిక్క ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసాడు.

ఇక అలాగే ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబుకి అయితే ఇలాంటి అద్భుతమైన సినిమాను తమకి అందించినందుకు తాను పర్శనల్ గా బిగ్ కంగ్రాట్స్, గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నానని బన్నీ తెలిపి ఈ సినిమా ప్రతి ఒక్క భారతీయుడి హృదయాలను కదిలిస్తుంది అని తన స్పందనను తెలియజేసాడు. దీనితో ముగ్గురు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :