తన 20 ఏళ్ల ప్రస్థానంపై ఐకాన్ స్టార్ పోస్ట్.!

Published on Mar 28, 2023 12:06 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర తన సొంత బ్రాండ్ తో ఎదిగిన స్టార్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే మరి అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. తన లాస్ట్ సెన్సేషనల్ హిట్ “పుష్ప” తో భారీ వసూళ్లు పాన్ ఇండియా లెవెల్లో తన రియల్ క్రేజ్ ని చూపించిన బన్నీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి అయితే నేటితో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. దీనితో అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేస్తుండగా ఈ 20 ఏళ్ల ప్రస్థానంపై బన్నీ కూడా స్పందించాడు.

ఈరోజు నేను 20 ఏళ్ళు సినీ పరిశ్రమలో కంప్లీట్ చేసుకున్నాను. ఇన్నేళ్ళలో నాపై చూపించిన ప్రేమ, ఇండస్ట్రీ లో ఎంతో మందితో వర్క్ చేయడం ఆనందంగా ఉందని అలాగే ఇప్పుడు ఏదైతే నేను ఉన్నానో ఇంత స్టేజి కి రావడానికి నా ఫ్యాన్స్ నా మంచి కోరుకునేవారు ఆడియెన్స్ వల్లనే అని వారికి నేనెప్పుడూ ఋణ పడి ఉంటానని ఈ 20 ఏళ్ల తన సినీ ప్రస్థానంపై పోస్ట్ చేసాడు. దీనితో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :