బింబిసార టీమ్‌ కు అల్లు అర్జున్ బిగ్ కంగ్రాట్స్ !

బింబిసార టీమ్‌ కు అల్లు అర్జున్ బిగ్ కంగ్రాట్స్ !

Published on Aug 7, 2022 8:50 PM IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా చారిత్రక కథాంశంతో వచ్చిన ‘బింబిసార’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్స్ ను రాబడుతుంది. మరోపక్క ఈ సినిమా విజ‌యంపై ప‌లువురు సినీ ప్రముఖులు సైతం సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు తెలుపుతున్నారు. అయితే, ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ కూడా బింబిసార చిత్ర‌బృందాన్ని ట్విట్ట‌ర్‌ లో అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు.

అల్లు అర్జున్ ఈ సినిమాని చూసి సోష‌ల్ మీడియా ద్వారా మేక‌ర్స్‌ ను అభినందించాడు. ‘బింబిసార టీమ్‌ కు బిగ్ కంగ్రాట్స్. ఇది ఒక‌ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్‌ ఫాంట‌సీ సినిమా. కళ్యాణ్‌ రామ్ గారి నటన అద్భుతం. ఆయన ఎప్పుడూ ఇండ‌స్ట్రీకి కొత్త టాలెంట్‌ను ప‌రిచ‌యం చేస్తున్నారు. అలాగే కొత్త త‌ర‌హా సినిమాల‌ను చేస్తున్నారు. అందుకే, ఆయ‌నంటే నాకు ఎప్పటికీ గౌరవమే’ అని బన్నీ ట్వీట్ చేశాడు.

మొత్తానికి ‘బింబిసార’ హిట్ కావడంతో.. ఇప్పుడు బింబిసార 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. అయితే, తన బింబిసార చిత్రాన్ని హిట్ చేసిన ప్రేక్షకులకు కళ్యాణ్ రామ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు