అల్లు అర్జున్ ‘పుష్ప – 2’ లేటెస్ట్ షూటింగ్ అప్ డేట్

Published on May 21, 2023 12:04 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తాజగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 (ది రూల్). సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా నెగటివ్ రోల్ లో ఫహాద్ ఫాసిల్ నటిస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది.

తాజాగా ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుండగా హీరో, విలన్ తో పాటు పలువురు ఇతర పాత్రధారుల పై కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నారట. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయి మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచాయి. మరి రిలీజ్ తరువాత పుష్ప 2 మూవీ ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :