అల్లు అర్జున్ ‘పుష్ప – 2’ లేటెస్ట్ షూట్ అప్ డేట్

Published on Mar 12, 2023 3:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ల కలయికలో సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2 (ది రూల్). 2021 డిసెంబర్ లో పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న పుష్ప 1 (ది రైజ్) మూవీ కి సీక్వెల్ గా రూపొందుతోంది పుష్ప 2. ఇక ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్ విలన్ పాత్ర చేస్తుండగా ఇతర కీలక పాత్రల్లో పలువురు టాలీవుడ్ నటులు యాక్ట్ చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో భారీ వ్యయంతో రూపొందుతోన్న ఈ మూవీ యొక్క లేటెస్ట్ షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ ఏరియాలో నైట్ షూటింగ్ జరుగుతోంది. హీరో అల్లు అర్జున్ తో పాటు పలువురు కీలక నటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ ని ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం :