క్రేజీ న్యూస్ : డిఫరెంట్ స్టైల్ లో ‘పుష్ప – 2’ ఫస్ట్ లుక్ టీజర్ ?

క్రేజీ న్యూస్ : డిఫరెంట్ స్టైల్ లో ‘పుష్ప – 2’ ఫస్ట్ లుక్ టీజర్ ?

Published on Mar 31, 2023 8:30 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2. ఏడాదిన్నర క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న పుష్ప కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్న పుష్ప 2 కి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనుందట యూనిట్. అయితే ఈ టీజర్ పై ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక న్యూస్ ఇంట్రెస్టింగ్ బజ్ గా మారింది. దాని ప్రకారం ఈ ఫస్ట్ లుక్ టీజర్ వీడియోతో ఒక చిన్న కొత్త ప్రయోగం చేసారట దర్శకుడు సుకుమార్. వీడియో మొత్తం కేవలం హీరో మీదే వుండదట, డిఫరెంట్ స్టైల్ లో పలు ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కూడా జోడించనున్నారట. మరి మొత్తంగా అయితే ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా ఈ టీజర్ రిలీజ్ కి సంబంధించి అతి త్వరలో మేకర్స్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు