ఆల్ ఇండియా రికార్డ్ సెట్ చేసిన “పుష్ప”..!

Published on Dec 19, 2021 3:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”.
భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో తొలి రోజు నుంచే కలెక్షన్ల వేటలో దూసుకుపోతూ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది.

అయితే తాజాగా ఈ సినిమా ఓ రికార్డ్‌ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలోకి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా “పుష్ప” రికార్డు సెట్ చేసింది. ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలోకి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సెట్ చేసింది. తొలిరోజున పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్ రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. 2021లో తొలిరోజే ఇంత గ్రాస్ సాధించిన భారతీయ చిత్రం మరొకటి లేదని పేర్కొంది.

సంబంధిత సమాచారం :