వైరల్ : తన సతీమణికి శుభాకాంక్షలు చెప్పిన బన్నీ !

Published on Mar 7, 2022 10:01 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డిని మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్నారు. నిన్నటితో ఈ జంట పెళ్లి చేసుకుని 11 వసంతాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ తన సతీమణికి బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలో ఒక సెల్ఫీని తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ సెల్ఫీలో ఈ జంట చాలా అందంగా కనిపిస్తుంది.

ఇక బన్నీ ప్రస్తుతం షూట్ కి విరామం తీసుకున్నాడు. త్వరలోనే పుష్ప రెండవ భాగం షూటింగ్‌ ను తిరిగి ప్రారంభించనున్నాడు. అన్నట్టు ఈ జంట తమ కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ తో తరచుగా పంచుకుంటారు. అందుకే స్నేహా రెడ్డికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ పెరిగారు.

సంబంధిత సమాచారం :