సమంత పాటకు శ్రద్దా దాస్ స్టెప్పులు… ఓ రేంజ్ రిప్లై ఇచ్చిన బన్నీ!

Published on Jan 26, 2022 7:07 am IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం లోని పాటలు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. భాష తో సంబంధం లేకుండా ఈ పాటలకు అన్ని చోట్ల నుండి ఆదరణ లభిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లోని అన్ని పాటలకు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ పెరిగింది.

తాజాగా ఈ చిత్రం లోని ఊ అంటావా, ఊ ఊ అంటావా అనే పాటకు నటి శ్రద్దా దాస్ స్టెప్పులు వేసింది. పుష్ప హ్యాంగ్ ఓవర్ అని, జస్ట్ ఫన్ అంటూ నటి చెప్పుకొచ్చింది. సమంత ఆడి పాడిన ఈ పాటకు ఈ తరహా క్రేజ్ రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రద్దా దాస్ ఈ వీడియో ను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో బన్నీ రిప్లై ఇచ్చారు. 100 వ దశ భ్రాంతి అంటూ చెప్పుకొచ్చారు. శ్రద్దా దాస్, ఆర్య 2 చిత్రం లో బన్నీ సరసన నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :