క్లైమాక్స్ ముగించేస్తున్న పుష్ప‌రాజ్

క్లైమాక్స్ ముగించేస్తున్న పుష్ప‌రాజ్

Published on Jul 3, 2024 4:37 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రేజీ సీక్వెల్ ‘పుష్ప‌-2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన ‘పుష్ప‌-1’ కి సీక్వెల్ గా ఈ మూవీ రానుంది. ఈ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు మేక‌ర్స్.

ఈ షెడ్యూల్ నెల‌రోజుల పాటు సాగ‌నుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు చిత్రంలోని కీల‌క న‌టీన‌టులు పాల్గొంటున్నారు. ఇక ఈ షెడ్యూల్ లో ప్రస్తుతం ‘పుష్ప‌-2’ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ యాక్ష‌న్ సీక్వెన్స్ ను చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

భారీ సెట్ లో ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ తో పుష్ప‌-2 చిత్ర షూటింగ్ టాకీ పార్ట్ పూర్త‌వుతుంది. ఈ సినిమాలో అందాల భామ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా నటిస్తోండ‌గా ఫ‌హాద్ ఫాజిల్, సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు