వైరల్ పిక్ : అల్లు అర్జున్ తో స్నేహారెడ్డి సూపర్ క్లిక్

Published on Jul 14, 2022 5:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చే నెలలో తన నెక్స్ట్ మూవీ పుష్ప ది రూల్ మూవీ షూట్ లో పాల్గొననున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్ప ది రైజ్ మూవీ ఎంతో పెద్ద సక్సెస్ అందుకుని సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

ఇక ఇప్పటికే ఈ మూవీ స్టోరీ, స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు సుకుమార్, మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ గా ఉన్నారు. మరోవైపు ఫ్యామిలీ తో కలిస్ ప్రస్తుతం ఆఫ్రికా దేశంలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్. వారి హాలిడే సందర్భంగా అక్కడి అందాలను క్లిక్ మనిపిస్తూ తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు ఆయన భార్య స్నేహారెడ్డి. నేడు తన భర్త అల్లు అర్జున్ తో కలిసి ఒక వండర్ఫుల్ ప్లేస్ లో దిగిన ఒక సూపర్ పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు స్నేహారెడ్డి. ఆ పిక్ లో ఫుల్ గా గడ్డం, క్రాఫ్ తో అల్లు అర్జున్ లేటెస్ట్ లుక్ ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :