“పుష్ప” యూనిట్ కి బన్నీ గోల్డెన్ గిఫ్ట్స్ సహా మరిన్ని.!

Published on Dec 8, 2021 6:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా “పుష్ప ది రైజ్” షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ అండ్ టీం చాలా కస్టపడి తెరకెక్కించారు. మరి ఎట్టకేలకు వారి కష్టాన్ని శిలావర్ సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసే రోజు దగ్గరలోనే ఉండగా బన్నీ గొప్ప మనసు మళ్ళీ చాటుకున్నాడు.

తన సినిమాకి సంబంధించిన డైరెక్షన్ టీం కి బహుమతులుగా బంగారాన్ని అందించాడట. బంగారు నాణేలు, ఉంగరాలను బహుమతులుగా బన్నీ డైరెక్షన్ టీం కి ఇవ్వగా ఉత్తర సిబ్బంది వరకు నగదు బహుమానాన్ని తాను ప్రత్యేకంగా పంపినట్టు సమాచారం. దీనితో బన్నీ తన సినిమా యూనిట్ పట్ల ఎంత వాత్సల్యంగా ఉన్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :