మరో యంగ్ టాలెంట్ కి బన్నీ స్పెషల్ విషెష్.!

Published on Oct 22, 2021 10:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం తన క్రియేటివ్ అండ్ హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి భాగం కంప్లీట్ అయ్యే పనిలో ఉంది. అయితే యంగ్ అండ్ టాలీవుడ్ లోకి వచ్చే కొత్త టాలెంటడ్ ఫిల్మ్ మేకర్స్ ని ఎప్పుడూ బన్నీ ఆదరించడంలో ముందుంటారు. గతంలో కూడా ఎంతోమందికి బన్నీ వారి వర్క్ ని గుర్తించి విషెష్ తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలానే ఇప్పుడు మరో యంగ్ టాలెంట్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రీసెంట్ గా అనౌన్స్ చేసిన సినిమా “గామి” టైటిల్ గ్లింప్స్ పై బన్నీ స్పందన తెలియజేసాడు. ఈ ఇంట్రెస్టింగ్ టీజర్ బాగుంది మొత్తం టీం కి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటి యంగ్ కొత్త ఫిల్మ్ మేకర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని ఈ చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని తెలిపారు.

సంబంధిత సమాచారం :

More