ఆ క్రెడిట్ అంతా సుకుమార్‌దే.. పుష్పరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Published on Dec 22, 2021 3:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరుపతిలో పుష్ప చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ చిత్తూరు భాషను నేర్చుకునేందుకు రెండు సంవత్సరాలు కష్టపడ్డానని, తొలి సక్సెస్‌మీట్‌ను ఇక్కడ నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

అయితే సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయని, నాకు ఎంత పేరు వచ్చినా.. ఏది వచ్చినా అది సుకుమార్‌కే దక్కుతుందని, ఆ ఏడు కొండల స్వామి మీ అందరి వెనుక ఎలా ఉన్నాడో, నా వెనుక సుకుమార్ అలా ఉన్నాడని అన్నారు. రష్మికతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, శ్రీవల్లిగానే కాకుండా రష్మిక లాగ కూడా ఆమె అంటే ఇష్టమని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారికి చాలా చాలా థ్యాంక్స్ అని అన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని, ముఖ్యంగా ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ అని అన్నారు.

సంబంధిత సమాచారం :