పవన్ కళ్యాణ్ పక్కకు చేరిపోయిన అల్లు అర్జున్ !


గత నెల రోజులుగా టాలీవుడ్ లో పెద్ద సినిమాల టీజర్, ట్రైలర్ల ఎక్కువైంది. ఒకదాన్ని తర్వాత మరొకటి రిలీజవుతూ అభిమానుల్ని ఖుషీ చేస్తున్నాయి. అదే సమయంలో యూట్యూబ్ లో రికార్డుల్ని కూడా సృష్టిస్తూ ఏ హీరో స్టామినా ఎంతో ప్రూవ్ చేస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ అయితే లైక్స్, డిస్ లైక్స్ అంటూ పలు అంశాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత నెల 23న విడుదలైన ఈ టీజర్ ముందెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా కోటి వ్యూస్ దక్కించుకుంది.

ప్రస్తుతం ఈ వ్యూస్ కౌంట్ కోటి 33 వేల వరకు ఉంది. ఈ సరికొత్త రికార్డ్ తో బన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన చేరిపోయాడు. ఇక అదే నెల ఆరంభంలో 4వ తేదీన రిలీజైన పవన్ ‘కాటమరాయుడు’ టీజర్ ఇప్పటికి కోటి 8 లక్షల వ్యూస్ సాధించి టాప్ ప్లేసులో ఉంది. అదే విధంగా చిరంజీవి ‘ఖైదీ నెం 150’ టీజర్ మూడు నెలల క్రితం విడుదలై ఇప్పటి దాకా 78 లక్షల 19 వేల వ్యూస్ పొందింది. మొత్తం మీద బన్నీ ఫ్యాన్స్ ఈ రికార్డుతో పండగ జోష్ పెంచుకుని ట్రైలర్ కోసం సిద్ధమవుతున్నారు.