పవన్ కళ్యాణ్ తర్వాత అల్లు అర్జునే !


స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ పై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలున్నాయి వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా అల్లు అర్జున్ సరికొత్తగా పంచె కట్టు కట్టుకుని బ్రాహ్మణ పాత్రలో కనిపించనుడటం, గత నాలుగైదు సినిమాల నుండి ఆయన ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్ బాక్సాఫీస్ దగ్గర బాగా వర్కౌట్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల అమితాసక్తి నెలకొంది.

దీంతో మొన్ననే శివరాత్రి సందర్బంగా రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ కు అశేష స్పందన లబిస్తోంది. యూట్యూబ్ లో విడుదలైన కొద్ది సేపటి నుండి రెండు రోజులు గడుస్తున్నా ఈ రోజుటి వరకు ఈ టీజర్ టాప్ ట్రేండింగ్ లో నిలవడం విశేషం. మొత్తం 55 గంటల్లో ఈ టీజర్ 4. 1 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని రెండవ స్థానంలో నిలివగా పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ 36 గంటల్లో 4 మిలియన్ల మార్క్ అందుకుని నెంబర్ వన్ స్థానంలోనూ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ 72 గంటల్లో 4 మిళియన్ల వ్యూస్ సాధించి 3వ స్థానంలోనూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ పాటల చిత్రీకరణ కోసం దుబాయ్ వెళ్ళింది. మెగా కుటుంబానికి రెండు హిట్లిచ్చిన దర్శకుడు హరీష్ సంక్ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.