సూపర్ క్లిక్ : ఫ్యామిలీ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Published on Mar 14, 2023 7:18 pm IST


టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ ఎంతో పెద్ద విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న పుష్ప ది రూల్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దీనిని భారీ యాక్షన్ తో కూడిన మాస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

అయితే ఇటీవల కొన్నాళ్లుగా బిజీ బిజీగా పుష్ప షూటింగ్ లో పాల్గొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తాజగా ఒకింత బ్రేక్ తీసుకుని తన ఫ్యామిలీ తో కలిసి రాజస్థాన్ వెకేషన్ కి వెళ్లారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఆయన అక్కడి పలు ప్రదేశాలు చుట్టేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం తన భార్య, పిల్లలతో కలిసి అక్కడ నుండి దిగిన ఒక పిక్ ని పోస్ట్ చేసారు అల్లు అర్జున్. ఈ బ్రేక్ టైంని హ్యాపీగా నా ఫ్యామిలీ తో గడుపుతున్నాను అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఆ సూపర్ క్లిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :