‘పుష్ప-2’ని పక్కకు పెట్టిన అల్లు అర్జున్.. కారణం ఏమిటో తెలుసా?

‘పుష్ప-2’ని పక్కకు పెట్టిన అల్లు అర్జున్.. కారణం ఏమిటో తెలుసా?

Published on Oct 30, 2024 11:11 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ కోసం ఇండియా వైడ్‌గా ఆడియెన్స్ ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా అందరినీ అలరించనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది.

కాగా, చిత్ర యూనిట్ ఈ చివరిదశ షూటింగ్‌ని ఎప్పుడెప్పుడు ముగిద్దామా అని తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే, అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప-2’ చిత్రాన్ని పక్కకు పెట్టి వేరొక ప్రాజెక్ట్ కోసం బ్రేక్ తీసుకున్నాడు. ఇంతకీ బన్నీ అంత అర్జెంట్‌గా ‘పుష్ప-2’ని కాదని.. ఏ ప్రాజెక్ట్ కోసం వెళ్లాడా అని అనుకుంటున్నారా.. అయితే.. బన్నీ బ్రేక్ తీసుకుని వెళ్లింది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం. ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ థంబ్స్ అప్ యాడ్ కోసం అల్లు అర్జున్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ యాడ్ షూట్‌ని దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశాడట. ‘పుష్ప-2’ చిత్రాన్ని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు