వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసిన బన్నీ !
Published on Apr 20, 2017 6:16 pm IST


హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా చేస్తున్న అల్లు అర్జున్ తన తరువాతి సినిమాను స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతోందట. అయితే సినీ వర్గాల నుండి తెలుస్తున్న తాజా సమాచారం ప్రకారం సినిమాను జూన్ నెలలో స్టార్ చేస్తారని తెలుస్తోంది.

అలాగే సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో కూడా దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇకపోతే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కానీ ఈ ప్రాజెక్ట్ కు విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ చేయనున్నారు. ‘నా పేరు సూర్య’ అనే టైటిల్ ను ఖరారు చేసిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు.

 
Like us on Facebook