నేను క్రియేటర్ అని బన్నీ అనుకుంటాడు – సుకుమార్

నేను క్రియేటర్ అని బన్నీ అనుకుంటాడు – సుకుమార్

Published on Feb 8, 2025 11:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సెన్సేషన్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరుకి నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు పట్టం కట్టారు. దీంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు రప్పా రప్పా అంటూ క్రియేట్ చేస్తూ వెళ్లింది. ఇక తమ చిత్రాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడంతో పుష్ప 2 యూనిట్ తాజాగా ‘థ్యాంక్స్ మీట్’ ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఓ క్రియేటర్ అని అందరూ అనుకుంటారని.. అయితే, అలాంటిది స్టార్ట్ చేసింది కేవలం బన్నీ మాత్రమే అని ఆయన చెప్పుకొచ్చారు. తాను పుష్ప స్టోరీ లైన్ రాసుకున్నప్పుడు ఇది ఎవరికి చెప్పాలా.. అని ఆలోచిస్తున్న క్రమంలో.. తనను క్రియేటర్‌గా భావించేది ఎవరా అని ఆలోచిస్తే అల్లు అర్జున్ గుర్తుకొచ్చాడని.. తనతో ఓ సినిమా చేయాలని ఈ స్టోరీలైన్ చెప్పడంతో వెంటనే ఓకే చెప్పాడని సుకుమార్ తెలిపారు.

ఇలా తనను ఈ ప్రపంచంలో తొలినాళ్లలోనే క్రియేటర్ అని అనుకున్న వ్యక్తి బన్నీ అని సుకుమార్ చెప్పడం విశేషం. ఇక ఈ థ్యాంక్స్ మీట్‌లో పుష్ప 2 యూనిట్ సభ్యులు ఎమోషన్‌కు గురయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు