సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్.!

Allu Arjun Latest Photos (2)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పబ్లిక్ ఈవెంట్స్ లో బాగా చురుకుగా పాల్గొనడమే కాకుండా టాలెంట్ ఉన్న వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అలాంటి అల్లు అర్జున్ ఈ సారి సమాజం కోసం ఏమన్నా చెయ్యాలి అనే ఉద్దేశం మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ పై అవగాహన కలిగించేందుకు తన స్వీయ నిర్మాణంలో, తను నటిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు.

ఈ సోషల్ అవేర్నెస్ షార్ట్ ఫిల్మ్ కి సుకుమార్ దశాకత్వం వహిస్తున్నాడు. ఈ షార్ట్ ఫిలిం ని స్వాతంత్ర్య దినోత్సవం రోజున అనగా ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో ఇలా సమాజానికి మేలు చేసే కారణం మీద షార్ట్ ఫిల్మ్ చేయలేదు. దాంతో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ప్రశంశల వెల్లువ కురుస్తోంది. మరి సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్నా ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఆగష్టు 15 వరకూ వేచి చూడాల్సిందే..

Exit mobile version