సెన్సేషన్ హీరోయిన్ కోసం అల్లు అర్జున్ !

మలయాళ బ్యూటీ వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ఏడాది సౌత్ నుండి గూగూల్ ట్రెండ్స్ లో టాప్ ప్లేస్ ను కైవసం చేసుకుంది. అత్యధికంగా గూగుల్ లో ఆమె గురించి అన్వేషించారంటే ఆమె కు దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనసరం లేదు. దాంతో ప్రియా ప్రకాష్ నటిస్తున్న తాజా చిత్ర ‘ఒరు ఆధార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదల చేస్తున్నారు.

కాగా తాజాగా ఈ చిత్రం యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జనవరి 23వ తేదీన ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు. ఈ విషయం గురించి చిత్రబృందమే పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రం మళయాళంతో పాటు తెలుగులో ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలకానుంది. సుఖీభవ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. ఒమర్ లులు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version