కొత్త చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్న బన్నీ !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డీజే చిత్రంలో నటిషున్నాడు. త్వరలో బన్నీ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.రచయిత వక్కంతం వంశి దర్శకత్వం వచించ బోయే ఈ చిత్రంలో అల్లుఅర్జున్ జవాను పాత్రలో కనిపిస్తాడట.నాపేరు సూర్య టైటిల్ తో రానున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం కథ ప్రకారం ఇందులో యుద్ధ సన్నివేశాలు ఉంటాయట. వాటిని అత్యద్భుతం గా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దిశాపటాని, కైరా అద్వానీ లలో ఎవరో ఒకరు ఈచిత్ర హీరోయిన్ గా ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నారు. విశాల్ – శేఖర్ లు సంగీతం అందిస్తారు.