బన్నీ, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబో మరోసారి.. కానీ..!

Published on Sep 18, 2021 9:01 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన జులాయి, s/o సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వీరి హ్యాట్రిక్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. సినిమా కోసం అయితే కాదు కానీ కేవలం ఒక యాడ్ షూట్ కోసమేనట.

అయితే దేశంలోని ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ అయినటువంటి రాపిడో వాణిజ్య ప్రకటన కోసం త్రివిక్రమ్ బన్నీని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప”తో అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :