అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

Published on Sep 21, 2023 3:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప మూవీ ఎంతో పెద్ద విజయం అందుకోవడంతో పాటు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. దానితో అందరిలో పుష్ప 2 పై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీని పార్ట్ 1 ని మించేలా మరింత అద్భుతంగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారని అంటోంది యూనిట్.

ఇక ఈ మూవీని వచ్చే ఏడాది ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించారు. అయితే విషయం ఏమిటంటే, దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ చేయనున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చే ఏడాది ఆగష్టు తరువాతనే ప్రారంభం అవుతుందని అంటున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. అది జనవరిలో రిలీజ్ కానుంది, అనంతరం అల్లు అర్జున్ మూవీ యొక్క పూర్తి స్క్రిప్ట్ పనులని ఆయన త్రివిక్రమ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాగా గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో మూవీస్ మంచి సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ తాజా మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కాగా ఈ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :