మొదలుకాక ముందే అల్లు అర్జున్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ?

allu-arjun1
మెగా ఫ్యామిలీలో వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరో అల్లు అర్జున్. సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి చిత్రాల విజయంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా అతనితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఆ అవకాశాన్ని బన్నీ దర్శకుడు హరీష్ శంకర్ కు ఇచ్చాడు. మొదటి నుండి మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న హరీష్, పవన్ తో ‘గబ్బర్ సింగ్’, ధరమ్ తేజ్ తో ‘సుబ్రమణ్యం ఫర్ సెల్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ‘దిల్ రాజు’ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం యొక్క షూటింగ్ ను సెప్టెంబర్ రెండవ వారంలో మొదలుపెట్టి 2017 మార్చి కల్లా పూర్తి చేసి రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న నాడు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు టీ టౌన్ లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై మెగా క్యాంప్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు.