“పుష్ప” తమిళ్ ప్రమోషన్స్ లో బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Dec 14, 2021 3:04 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో తెరకెక్కించిన భారీ సినిమా “పుష్ప”. జస్ట్ ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బన్నీ చురుకుగా పాల్గొంటున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈరోజు ఐకాన్ స్టార్ సహా ఇతర చిత్ర బృందం తమిళనాడు కి పుష్ప తమిళ్ వెర్షన్ ని ప్రమోట్ చెయ్యడానికి వెళ్లారు.

అయితే అక్కడ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా ఆసక్తికర కామెంట్స్ చేయడం మరింత ఆసక్తిగా మారింది. ఈ సినిమాకి ఇక్కడ ఇంత రీచ్ రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సామి సామి సాంగ్ అని ఈ పాటని ఇక్కడ కూడా చాలా ఓన్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపాడు.

అలాగే మరిన్ని మాటలు జోడిస్తూ తాను ఇక్కడే 20 ఏళ్ళు పాటు ఉన్నానని పుట్టి పెరిగింది ఇక్కడే అని పుష్ప సినిమాకి చాలా ఎఫర్ట్స్ పెట్టాం ఇది ఒక్క సినిమా నాలుగు సినిమాలకు సమానంగా చేశామని తమిళ్ లోనే మాట్లాడి బన్నీ ఆశ్చర్యపరిచాడు. దీనితో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. మరి తమిళ ఎలాంటి రెస్పాన్స్ ఈ సినిమా అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :