“పుష్ప” కోసం అల్లు అర్జున్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టెప్..!

Published on Nov 13, 2021 5:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ చేస్తున్న భారీ సినిమా “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కంప్లీట్ డిఫరెంట్ గా దర్శకుడు సుకుమార్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ తన రోల్స్ తోనే కావాల్సినంత హైప్ ని తెచ్చుకున్నారు.

ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన పూర్తి ఎఫర్ట్స్ ని కూడా పెట్టేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసాడని టాక్ ఉండగా ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో తెలుస్తుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మొత్తం మూడు భాషలకు గాను తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట.

తెలుగులో ఆల్రెడీ తన యాసా అదీ అదిరిపోయాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఇక హిందీలో కూడా అల్లు అర్జున్ నే చెప్పుకుంటున్నాడట. అలాగే తమిళ్ కానీ కన్నడ కానీ ఈ రెండిటిలో ఒకటి అల్లు అర్జున్ డబ్బింగ్ తానే చెప్పుకోనున్నాడట. ఇది ఇంట్రెస్టింగ్ స్టెప్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ చాలా ఈజ్ గా ఉంటుంది. సో ఈ స్టెప్ చాలా మంచిదే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More