మెగాస్టార్ చిరంజీవికి ఐకాన్ స్టార్ బర్త్ డే విషెస్.. ఎప్పటికీ చిరు ఫ్యానే అంటూ క్లారిటీ..!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు పలువురు సెలబ్రిటీలు విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన అభిమాన హీరోకు తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన బన్నీ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, తమకు ఆయనే అతిపెద్ద పిల్లర్ అని కొనియాడాడు. తమను ఎంతో ఇన్‌స్పైర్ చేసి తమ ఎదుగుదలకు బాటలు వేసిన చిరుకి ఎల్లప్పటికీ అభిమానిగా ఉండిపోతానంటూ ఆయన పోస్ట్ చేశాడు.

ఈ సందర్భంగా బన్నీ KKAVCF(కట్టె కాలే అంత వరకు చిరంజీవి ఫ్యానే) అంటూ మరోసారి తన అభిమానం చాటుకున్నాడు. ఇక బన్నీ చేసిన ఈ పోస్ట్‌ను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Exit mobile version