హిందీ లో “అల వైకుంఠ పురంలో” కి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jan 17, 2022 12:35 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయారు. పుష్ప ది రైజ్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది అని చెప్పాలి. దాదాపు 80 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను సాధించి అల్లు అర్జున్ అక్కడ తన సత్తా చాటుతున్నారు.

అదే తరహాలో ఇప్పుడు అల వైకుంఠ పురంలో చిత్రం ను హిందీ వెర్షన్ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ను అల్లు అర్జున్ ఫిల్మ్స్ మరియు గోల్డ్ మైన్ టెలి ఫిల్మ్స్ వారు హిందీ వెర్షన్ లో విడుదల చేస్తున్నారు. జనవరి 26 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, థమన్ సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :