ముహూర్తం షాట్ జరుపుకున్న అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘డీజే’

allu-dj
అందరి మెగా హీరోల్లోకి వందకు వందశాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న హీరో అల్లు అర్జున్ తాజాగా కొత్త చిత్రాన్ని ప్రారంబించారు. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘డీజే – దువ్వాడ జగన్నాథం’ అన్న వైవిధ్యమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం యొక్క ముహూర్తం షాట్ ఈరోజే ఫిల్మ్ నగర్ లో ప్రముఖుల నడుమ జరిగింది. దర్శకుడు వివి వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ బన్నీపై క్లాప్ ఇచ్చారు.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ నిర్మిస్తున్నారు. గతంలో బన్నీ – దిల్ రాజ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య, పరుగు’ వంటి చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ చివరి చిత్రం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కూడా హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.