కేరళలో సైతం అదే ఊపు చూపిస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్’ !


అల్లు అర్జున్ తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ తెలుగునాట ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే ఈ చిత్రాన్ని మలయాళంలోకి డబ్ చేసి ఆగష్టు 11న ‘ధృవరాజ జగన్నాథ్’ పేరుతో కేరళలో రిలీజ్ చేశారు. బన్నీకి కేరళలో మరే తెలుగు హీరోకి లేనంత క్రేజ్ ఉండటం, ఆయన గత చిత్రం ‘సరైనోడు’ అక్కడకు కూడా భారీ వసూళ్లను రాబట్టడంలో డీజేకు కూడా మంచి ఆదరణ దక్కుతోంది.

మొదటిరోజు శుక్రవారం కాస్త తక్కువగా ఉన్న వసూళ్లు ఆదివారం నాటికి పుంజుకున్నాయి. దీంతో మూడు రోజులకు కలిపి సుమారు రూ.1.5 కోట్లను వసూలు చేసిందీ చిత్రం. విడుదలైన చాలా చోట్ల చిత్రం హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. మరి ఈ చిత్రం ‘సరైనోడు’ వసూలు చేసిన రూ. 4 కోట్లను దాటుతుందో లేదో చూడాలి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ సంగీతం సమకూర్చారు.