అర్హతో బన్నీ రన్నింగ్ రేస్.. వైరల్ అవుతున్న వీడియో !

Published on Feb 6, 2022 9:12 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అద్భుతమైన నటుడే కాదు, అందమైన తండ్రి కూడా. అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్, అలాగే తన కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన వీడియోలో అర్హతో కలిసి తాను రన్నింగ్ చేస్తూ కనిపించాడు.

బన్నీ ఫ్యాన్స్ ను ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో బన్నీ – అర్హ మధ్య పరుగు పోటీ చూడటానికి చాలా సరదాగా అనిపిస్తుంది. అందుకే, ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రన్నింగ్ రేస్ లో అల్లు అర్జున్.. అర్హను గెలిపించడానికి స్లోగా రన్ చేస్తూ చివర్లో అర్హను ఎత్తుకుని ముద్దు పెట్టడం బాగుంది. మొత్తానికి బన్నీ షూటింగ్ కి గ్యాప్ వస్తే.. తన పిల్లలతో సరదాగా ఇలా గడుపుతూ ఉంటాడు.

సంబంధిత సమాచారం :