త్వరలోనే అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన ?

Allu Arjun2

అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య’ ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తన తదుపరి చిత్రాన్ని పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్నారు బన్నీ. ప్రస్తుతం హాలీడే ట్రిప్లో ఉన్న ఆయన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నారట.

ఇప్పటికే స్టోరీ లైన్ విన్న స్టైలిష్ స్టార్ కొన్ని చేంజెస్ చేయమని విక్రమ్ కు చెప్పారని, ఆయన అదే పనిలో ఉన్నారని సమాచారం. ఒకసారి మార్పులు పూర్తవగానే విక్రమ్ బన్నీకి ఫైనల్ నరేషన్ ఇస్తారట. అది గనుక నచ్చితే వెంటనే బన్నీ సినిమాను ఫైనల్ చేసి అధికారికంగా అనౌన్స్ చేస్తారని వినికిడి. మరి విక్రమ్ కుమార్ తన ఫైనల్ నరేషన్ తో బన్నీని ఇంప్రెస్ చేస్తారో లేదో చూడాలి.

Exit mobile version