ఈ నెల 14న ప్రారంభం కానున్న అల్లు అర్జున్- వక్కంత వంశీ కొత్త చిత్రం!


స్టైలిష్ స్టార్ట్ అల్లు అర్జున్ రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సంబంధించిన తాజా అప్డేట్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బయటకు వచ్చింది. ఈ నెల 14న ఈ చిత్రం ప్రారంభం జరుపుకోనుంది. రామలక్ష్మి సిని క్రియేషన్స్ లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా తర్వాత వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. బారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కువగా భాగం ఉత్తర భారతదేశంలో షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తాజా చిత్రం డీజే పూర్తి కాగానే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుందని తెలుస్తుంది.