షూటింగ్ కోసం అక్కడికి వెళుతున్న అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నాపేరు సూర్య చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తయింది. తరువాతి షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఊటీ వెళ్లనున్నారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.

సీనియర్ హీరో అర్జున్ మరియు శరత్ కుమార్ లు కీ రోల్స్ ప్లే చేయనున్నారు. కాగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. వక్కంతం వంశి తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.