అల్లు స్టూడియోస్ లో అల్లు రామలింగయ్య విగ్రహం ఆవిష్కరణ

Published on Oct 1, 2021 4:00 pm IST

లెజెండరీ హాస్య నటుడు అయిన పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి నేడు. ఈ వేడుక సందర్భంగా ఆయన మనవళ్ళు అల్లు అర్జున్, అల్లు శిరీష్ మరియు వెంకటేష్ లు అల్లు స్టూడియోస్ లో నేడు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ తాతను, చిత్ర పరిశ్రమ కి అందించిన సహకారం ను గుర్తు చేసుకున్నారు.

అదే విధంగా ఈ రోజు అల్లు రామలింగయ్య అల్లుడు అయిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, చిరు భార్య సురేఖ లు రాజమండ్రి లోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాల లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించ నున్నారు.

సంబంధిత సమాచారం :