ఇతర భాషల్లో డబ్ కానున్న అల్లు హీరో సినిమా !

26th, December 2017 - 04:19:22 PM

వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ నటించిన ఒక్క క్షణం’ సినిమా ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . పార్లల్ లైఫ్ అన్న పాయింట్ ఆధారంగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాడు. సురభి ఈ సినిమాలో అభినయం తో పాటు మంచి నటనతో ఆకట్టుకోబోతోంది.

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఈవెంట్ కు హాజరవ్వడం జరిగింది. ఈరోజు బెంగళూర్ లో జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు శిరీష్ మాట్లాడుతూ ఈ సినిమాను ఇతర భాషల్లో డబ్ చెయ్యడం జరుగుతుందని వెల్లడించారు. యునివర్సల్ కాన్సెప్ట్ కావడంతో అన్ని భాషల వారు ఈ సినిమాను ఆదరించే అవకాశం ఉంది.