మోహన్ లాల్ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పిన అల్లు శిరీష్ !
Published on Nov 11, 2016 8:43 am IST

Allu-Sirish

యంగ్ హీరో అల్లు శిరీష్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో చేస్తున్న మలయాళ చిత్రం ‘1971-బియాండ్ బోర్డర్స్’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఆయన కెరీర్ మరింత ముందుకెళ్ళనుంది. మేజర్ రవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అల్లు శిరీష్ ఈ మధ్యే తన షెడ్యూల్ ను కూడా మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ రాజస్థాన్ లోని అరుణ్ ఘర్ ఆర్మీ బేస్ లో జరుగుతోంది. ఈ విషయంపైనే మీడియాతో మాట్లాడుతూ ఈ రోల్ తనకెలా వచ్చింది అనే విషయాన్ని శిరీష్ తెలిపారు.

‘నాకు దేశభక్తి ఎక్కువ. అందుకే ఈ రోల్ నాకు దక్కింది. ఇలాంటి హిస్టారికల్ సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నాను. మేజర్ రవి హైదరాబాద్ వచ్చినప్పుడు అనుకోకుండా ఆయన్ను కలిశాను. అప్పుడు సినిమాల గురించి మాట్లాడుతూ మన చరిత్రకు సంబందించిన కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం. అప్పుడే ఆయన నాకు నీలాంటి వ్యక్తే కావాలి, ఈ రోల్ నువ్వే చేయాలి అన్నారు. ఆయనకు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తి, రిస్క్ తీసుకునే వ్యక్తి కావాలి. అవన్నీ నాలో చూశారు. అందుకే రోల్ ఆఫర్ చేశారు. ఇందులో పనిచేయడం ద్వారా మోహన్ లాల్ గారి దగ్గర్నుంచి కొన్ని విషయాలు నేర్చుకునే ఛాన్స్ దొరికింది’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమాలో శిరీష్ ఓ వార్ ట్యాంక్ కమాండర్ గా కనిపించనున్నాడు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook